»After Congress Rahul Gandhis Setback His Namesake Disqualified For Not Filing Expenses
Setback for Rahul Gandhi: ఎన్నికల ఖర్చు సమర్పించలేదని రాహుల్ గాంధీకి ఈసీ షాక్.. కానీ!
వాయనాడ్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వలేదని కేఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అయితే ఈయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కాదు.
వాయనాడ్ Wayanad Lok Sabha) నుండి ఎన్నికల్లో పోటీ చేసి, నిర్ణీత గడువులోగా ఆ ఖర్చుల వివరాలను సమర్పించనందుకు గాను రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనే వ్యక్తి పైన కేంద్ర ఎన్నికల సంఘం (central election commission) వేటు వేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో (2019 Lok Sabha Elections) కేరళలోని వాయనాడ్ (Kerala, Wayanad) నుండి పోటీ చేశారు రాహుల్ గాంధీ (Rahul Gandhi). అయితే ఇది అందరు అనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) కాదు.. ఇతని పేరు కూడా అదే. ఇతని పూర్తి పేరు కేఈ రాహుల్ గాంధీ (KE Rahul Gandhi). తండ్రి పేరు వల్సమ్మ. స్వతంత్ర అభ్యర్థిగా (Independent) పోటీ చేసి 2189 ఓట్లను దక్కించుకున్నారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఏడు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్ గాంధీ ఖర్చుల వివరాలను సమర్పించనందుకు గాను 2021 సెప్టెంబర్ 13వ తేదీ నుండి 2024 సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది ఈసీ.
2019 లోకసభ ఎన్నికల్లో వాయనాడ్ లోకసభకు 20 మంది బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీకి 706,367 ఓట్లు వచ్చాయి. సీపీఐకి చెందిన పీపీ సునీర్ 274,597 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతు పలికిన బీడీజేఎస్ అభ్యర్థు తుషార్ వెల్లపల్లి 60 వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎవరికి కూడా కనీసం పదివేల ఓట్లు రాలేదు. బీఎస్పీ, సీపీఐ(ఎంఎల్) వంటి పార్టీలకు వెయ్యి రెండువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో పదమూడు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో రాహుల్ గాంధీ కేఈ అనే వ్యక్తి ఉన్నారు. అతనికి 2100కు పై చిలుకు ఓట్లు వచ్చాయి. అత్యల్పంగా ఇండిపెండెండ్ అభ్యర్థి శివప్రసాద్ కు 132 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, నాలుగేళ్ల క్రితం మోడీ అనే ఓబీసీ వర్గాన్ని విమర్శించినందుకు గాను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో, నిబంధనల మేరకు లోకసభ సచివాలయం ఆయనను డిస్ క్వాలిపై చేసింది. దీనిపై రాహుల్ కోర్టుకు వెళ్తారో చూడాలి.