NRPT: ఎత్తిపోతల పథకంలో భాగంగా కానుకుర్తి రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే చెక్కులు అందజేయాలని సర్పంచ్ నారాయణ ఆధ్వర్యంలో ఆర్డీవో రాంచందర్‌కు వినతిపత్రం అందించారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని కోరారు. చెక్కులు ఇవ్వకుండా పని ప్రారంభిస్తే అంగీకరించబోమన్నారు. RDO సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు.