రంగారెడ్డి: మహాశివరాత్రి సందర్బంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.