MNCL: శివరాత్రి పండుగ పూట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట గోదావరిలో స్నానానికి వెళ్లి పారుపల్లికి చెందిన రాజేశ్(50) నీటిలో గల్లంతయినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.