నిజామాబాద్: గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని అంబికా సహిత నగరేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో గోపూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, సహకరించిన సభ్యులకు ఆ గోమాత ఆశీస్సులు, ఆ అంబికా సహిత నగరేశ్వరుడి ఆశీస్సులు మరియు వాసవి మాత కృపా కటాక్షాలు ఉండాలని పురోహితులు ప్రత్యేకంగా ఆశిర్వధించారు.