మెదక్: మహా శివరాత్రి సందర్బంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గమాత దేవాలయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాతార భద్రతను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. భద్రతపరంగా ప్రజలందరూ ధైర్యంగా ఉండాలన్నారు.