KNR: హుజూరాబాద్‌లో 2రోజుల క్రితం భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ACP శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. అప్పులు ఎక్కువై ఎలా తీర్చాలో తెలియక నాగరాజు అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై దాడి చేయించాడు. దొంగల ముఠాతో చేయి కలిపి ఇంట్లో నుంచి 70తులాల బంగారం, రూ.5లక్షలు చోరీ చేయించ్చినట్లు విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదుచేసి, ఐదుగురిని రిమాండ్‌కు తరలించామని ACP తెలిపారు.