మంచిర్యాల: ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉట్నూర్ ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఉట్నూరు పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లాలోనీ ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడే విద్యార్థులకు మెరుగైన వైద్యం చేయాలన్నారు.