»Even If You Are In The Cm Race There Are No Differences With Dk Siddaramaiah
Karnataka : డీకే శివకుమార్ తో విభేదాలు లేవు.. సీఎం రేసులో ఉన్నా : సిద్ధరామయ్య
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య (Sidda Ramaiah) ఆసక్తికం కామెంట్స్ చేశారు. తాను వంద శాతం సీఎం అభ్యర్థినేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తనతో పాటీ పడుతున్న డీకే శివకుమార్ (DK Sivakumar) తో తనకు ఎలాంటి విభేదాలు లేవని సిద్ద తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలయింది. మే 10న ఎన్నికలు జరగనుండగా... మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య (Sidda Ramaiah) ఆసక్తికం కామెంట్స్ చేశారు. తాను వంద శాతం సీఎం అభ్యర్థినేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తనతో పాటీ పడుతున్న డీకే శివకుమార్ (DK Sivakumar) తో తనకు ఎలాంటి విభేదాలు లేవని సిద్ద తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలయింది. మే 10న ఎన్నికలు జరగనుండగా… మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత శాసనసభా పక్ష నేతను పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ఎప్పుడూ ముందుగా ప్రకటించలేదని అన్నారు. మరోవైపు, ఇవే తన చివరి ఎన్నికలు అని సిద్ధరామయ్య చెప్పారు.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్(Oat from home) విధానం ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు(Senior citizens), దివ్యాంగులకు మాత్రమే ఓట్ ఫ్రమ్ హోం అవకాశం ఇవ్వనున్నారు. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 24తో కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) పదవీకాలం ముగియనుంది. బీజేపీకి 104 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌కు 78 సీట్లు, జేడీఎస్‌కు 37 సీట్లు వచ్చాయి. అలాగే కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకోగా.. ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుని అది పెద్ద పార్టీగా అవతరించగా.. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో జేడీఎస్ అధ్యక్షడు కుమారస్వామి(Kumaraswamy) సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కుమారస్వామి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మళ్లడంతో కాంగ్రెస్-జేడీఎస్ (Congress-JDS) సంకీర్ణ ప్రభుత్వం బలం కోల్పోయింది. ప్రభుత్వం కూలిపోవడంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా జరుగుతుందనే ఆరోపణలు ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో కర్ణాటకలో బీజేపీ (BJP) ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇలాంటి తరుణంలో లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలకు ముందు జరగనున్న కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.