NRML: వికలాంగుల పెన్షన్ కొరకు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై, సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ.. జిల్లాలో వందలకు పైగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని అన్నారు.