ADB: బేల మండలంలోని కరోని (బి) గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులకు ప్లేట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి విద్యార్థులకు ప్లేట్లను ఇవాళ అందజేశారు. ప్రైమరీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.