JN: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. ఇవాళ జనగామ మండలం యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజ మహేంద్ర నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.