JN: పాలకుర్తిలో బీఎస్పీ నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ అధ్యక్షుడు ఈదునూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజన నాయకులను టార్గెట్ చేసిందని విమర్శించారు.