TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఓ మార్ట్లో సౌండ్ సిస్టమ్ విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.