HYD: HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్‌ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి. వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం అన్నారు. చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయ్యాలన్నారు.