KMM: కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ప్రజలు చికెన్ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆదివారం అయినా వైరా మున్సిపాలిటీలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. అసత్య ప్రచారం మానుకోవాలని, దీని వల్ల తమ వ్యాపారానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని చికెన్ షాప్ యాజమానులు మండిపడ్డారు. అలాగే ప్రజలు చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు.