MNCL: తాండూర్ మండలం గోపాల్ నగర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో శనివారం పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ గోపికృష్ణ నిర్ధారించడం కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న మంచినీటి బావి వద్ద పులి పాదముద్రలను అధికారులు శనివారం గుర్తించారు. స్థానిక రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.