JGL: గత బీఆర్ఎస్ పాలనలో దశాబ్దకాలంగా ఉద్యోగాలు లేక యువకులు ఎంతో నష్టపోయారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలు కల్పించి యువకులకు మేలు చేసిందని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.