మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర కల్యాణ మహోత్సవం ఈనెల 26న జరుగనున్న సందర్భంగా ఆలయ సమీపంలోని నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని 25లోగా ప్రారంభించాలని పట్టణ నాయకులు కాంట్రాక్టర్కు సూచించారు. శనివారం రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ వెంకన్నతో కలిసి పరిశీలించారు.