NGKL: కొప్పునూరు గ్రామంలో శనివారం మంత్రి జూపల్లి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రూ.20 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.50 లక్షల సీసీ రోడ్, వడ్డెర కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలతో నిర్మించనున్న పలు భవనాలకు భూమి పూజ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీ పోచమ్మ గుడిని సందర్శించారు.