MLG: మంగపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలనీ, పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.