NLG: ఉత్తమ అవార్డులు పొందిన దామరచర్ల తహశీల్దార్ జవహర్ నాయక్, మండల వైద్యాధికారి డా. అడావత్ నాగేశ్వరరావులను సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. వారు మాట్లాడుతూ.. వృత్తిపరంగా చేసినటువంటి శ్రమను, పనితనాన్ని గుర్తించి వారికి అవార్డు రావడం గిరిజన జాతికి గర్వకారణమని అన్నారు.