SDPT: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో చిన్నకోడూర్ మం. చౌడారం గ్రామానికి చెందిన రవి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. గతేడాది వెలువడిన పోలీస్ ఉద్యోగ ఫలితాల్లో పోలీస్ కానిస్టేబుల్, గ్రూపు-4(వార్డు ఆఫీసర్)గా, ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆర్అండ్ బీ ఏఈగా ఎంపికయ్యాడు.