Meter Trailer పవర్ ఫుల్ గా ‘మీటర్’.. పోలీస్ పాత్రలో రఫ్ఫాడించిన కిరణ్
‘వేయడం నాకు కొత్త కాదు.. నీ ముందు వేయడం నాకు కొత్త’, ‘అర్రె మీరు చేసేది వరలక్ష్మి వ్రతమా’ అంటూ సాగే డైలాగ్ లు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్ లుక్ లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం ఈసారి భారీ యాక్షన్ సీన్స్ చేశాడు.
‘మీటర్’ (Meter Movie) అనే సినిమాతో టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తొలిసారి మాస్ యాంగిల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి టీజర్, పాటలు ఇప్పటికే విడుదల కాగా ప్రేక్షకుల్లో (Audience) ఆసక్తి రేపుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Trailer)ను చిత్రబృందం విడుదల చేసింది. తండ్రి తనకు ఇచ్చిన బాధ్యత ఇతివృత్తంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. మొదటిసారి కిరణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు.
ఈ మధ్యనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కిరణ్ జయపజయాలు పక్కన పెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కాడూరి రమేశ్ (Kaduri Ramesh) దర్శకత్వంలో (Direction) తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు. సంభాషణలు (Dailogues) బలంగా ఉన్నాయి. ‘వేయడం నాకు కొత్త కాదు.. నీ ముందు వేయడం నాకు కొత్త’, ‘అర్రె మీరు చేసేది వరలక్ష్మి వ్రతమా’ అంటూ సాగే డైలాగ్ లు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్ లుక్ లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం ఈసారి భారీ యాక్షన్ సీన్స్ చేశాడు. సప్తగిరి (Saptagiri), పోసాని కృష్ణ మురళీ (Posani KrishnaMurali) నవ్వులు పూయించనున్నారు.
ఈ సినిమాతో కొయంబత్తూర్ కి చెందిన అతుల్య రవి (Athulyaa Ravi) అనే కొత్త అందం సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నది. క్లాప్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ (Clap Entertainment)పై చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సాయి కార్తీక్ సంగీతం అందించాడు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 7వ తేదీన మీటర్ థియేటర్ లలో విడుదల కానుంది.