»Karnataka Congress Dk Shivakumar Showers %e2%82%b9 500 Notes In Road Show
Currency Notes ప్రచారంలో జనంపైకి 500 నోట్లు వెదజల్లిన సీఎం అభ్యర్థి
వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కమీషన్ ప్రభుత్వాన్ని సాగనంపి కర్ణాటకను అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని శివ కుమార్ తెలిపారు.
కర్ణాటక (Karnataka)లో అవినీతి ప్రభుత్వాన్ని తొలగించాలనే పట్టుదలతో పాటు మరోసారి తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఉంది. 40 శాతం కమీషన్ (40 Percent Govt) ప్రభుత్వంగా గుర్తింపు పొందిన బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను వినియోగించుకుని ఎన్నికల్లో (Elections) లబ్ధి పొందాలని కేపీసీసీ (KPCC) వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు పార్టీ విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. అన్ని సర్వేలు (Surveys) కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతుండడంతో హస్తం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు డీకే శివ కుమార్ (DK Shivakumar) వ్యవహారం పార్టీని ఇరుకున పడేసింది. ఆయన ఓ ప్రచారం (Road Show)లో వాహనంపై నుంచి ప్రజలపైకి నోట్లు వెదజల్లారు. ఇది కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. అతడి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే డబ్బులు విసిరే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ట్రబుల్ షూటర్ (Trouble Shoot)గా గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడు డీకే శివ కుమార్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ‘ప్రజాధ్వని’ (Prajadwani) పేరిట చేపట్టిన యాత్ర మండ్య జిల్లాలో (Mandya District) మంగళవారం పర్యటించారు. బెవినహళ్లిలో పర్యటిస్తున్న సమయంలో శివ కుమార్ అనూహ్యంగా ప్రజలు, కార్యకర్తలపై రూ.500 నోట్ల కట్టలు (Currency Notes) తీసుకుని విసిరారు.
అతడి వ్యవహార తీరు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోట్ల వర్షంపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తప్పుబట్టారు. ప్రజలను బిచ్చగాళ్లుగా చూస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతోందని విమర్శించారు. అయితే ఈ వ్యవహారంపై డీకే శివ కుమార్ ఇంకా స్పందించేందుకు ఇష్టపడలేదు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కమీషన్ ప్రభుత్వాన్ని సాగనంపి కర్ణాటకను అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని శివ కుమార్ తెలిపారు. కాగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో శివ కుమార్ మొదటి వరుసలో ఉన్నారు.
#WATCH | Karnataka Congress Chief DK Shivakumar was seen throwing Rs 500 currency notes on the artists near Bevinahalli in Mandya district during the ‘Praja Dhwani Yatra’ organized by Congress in Srirangapatna. (28.03) pic.twitter.com/aF2Lf0pksi