Bank Holidays ఏప్రిల్ నెలలో బ్యాంక్ కు 11 రోజులు సెలవులు
ఆర్థిక సంవత్సరం (Economice Year) ముగియడంతో బ్యాంక్ ఉద్యోగులు సెలవులు లేకుండా మరీ పని చేశారు. ఆదివారం, రెండో, నాలుగో శనివారం కూడా కార్యాలయాలకు చేరుకున్నారు. ఏప్రిల్ తో 2023-24 ఆర్థిక సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతోంది.
మారిన సాంకేతిక పరిజ్ణానంతో ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు (Banking Service) అరచేతిలో (On Hand) పూర్తవుతున్నాయి. కానీ గతంలో ప్రతి విషయానికి బ్యాంక్ కు వెళ్లి గంటల కొద్దీ వేచి ఉండి పని పూర్తి చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు బ్యాంక్ సేవలు సులభతరమయ్యాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ (Online Banking) సేవలు అందుబాటులోకి వస్తుండడంతో వినియోగదారులు (Customers) ఎక్కడి నుంచైనా సేవలు పొందుతున్నారు. అయినా ఇప్పటికీ కొన్ని వాటి కోసం బ్యాంకులకు (Banks) వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకులకు ఎప్పుడు సెలవులు (Holidays) ఉంటాయో తెలుసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ (April) నెలలో బ్యాంకులు పని చేసే రోజులు తెలుసుకోండి.
ఆర్థిక సంవత్సరం (Economice Year) ముగియడంతో బ్యాంక్ ఉద్యోగులు సెలవులు లేకుండా మరీ పని చేశారు. ఆదివారం, రెండో, నాలుగో శనివారం కూడా కార్యాలయాలకు చేరుకున్నారు. ఏప్రిల్ తో 2023-24 ఆర్థిక సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో 5 ఆదివారాలతో పాటు పండుగలు కలుపుకుని బ్యాంక్ లకు ఉన్న సెలవులు 11 రోజులు. జాతీయ నాయకుల పండుగలతోపాటు మరికొన్ని పండుగలు వస్తున్నాయి. మొత్తం 19 రోజులు పని దినాలు (Working Days) ఉండనున్నాయి.
ఏప్రిల్ 1 అకౌంట్లు క్లోజింగ్ డే
2న ఆదివారం
5 జగ్జీవన్ రామ్ జయంతి
7న గుడ్ ఫ్రైడే
8న రెండో శనివారం
9న ఆదివారం
14న అంబేడ్కర్ జయంతి
22న రంజాన్ తో పాటు నాలుగో శనివారం
23న ఆదివారం
30న ఆదివారం