»Cars Collecting Customers Personal Contents Mozilla Foundation Revealed Shocking Facts
Viral News: కస్టమర్ల పర్సనల్ విషయాలను సేకరిస్తున్న కార్లు
కస్టమర్ల పర్సనల్ విషయాలను సేకరిస్తున్న కార్లపై మొజిల్లా ఫౌండేషన్ అధ్యయనం షాకింగ్ విషయాలను బైట పెట్టింది. ఇంటర్నెట్ లేకున్నా కస్టమర్ల ప్రైవసీకి భంగం వాటిళ్లేలా ప్రముఖ కార్ల సంస్థలు ఉన్నాయని తెలిపింది.
cars collecting customers' personal contents Mozilla Foundation revealed shocking facts.
Viral News: పెరుగుతున్న టెక్నాలజీ(Technology) మానవాళికి ఎంత ప్రయోజకరమో తెలియదు కాని, ముప్పు మాత్రం గట్టిగానే ఉంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు(Electric cars) మార్కెట్లోకి వచ్చేశాయి. ప్రస్తుతం వాహనాలన్ని డిజిటల్ మయంగా మారుతున్నాయి. ఈ తరుణంలో వ్యక్తుల సమాచార గోప్యత (Data Privacy)పై ఓ ప్రముఖ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రముఖ బ్రాండ్ల కార్లు వినియోగదారుల రహస్య డేటాను సేకరిస్తుందని పేర్కొంది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న మొజిల్లా ఫౌండేషన్ 25 ప్రముఖ కార్ల బ్రాండ్లను అధ్యయనం చేసింది. వినియోగదారుల ప్రైవసీ విషయంలో ఏ కంపెనీ ప్రమాణాలు పాటించడం లేదని వెల్లడించింది.
ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే గ్యాడ్జెట్లు మాత్రమే ఇలా డేటా చోరి చేస్తాయని అనుకున్నాము. కానీ, ప్రముఖ కార్ల బ్రాండ్లన్ని నెమ్మదిగా సమాచారాన్ని సేకరించే యంత్రాలుగా మారి డేటా విక్రయ బిజినెస్‌లోకి ప్రవేశించాయి అని మొజిల్లా తెలిపింది. ఈ విషయంలో టెస్లా ముందుందని ఆరోపించింది. కస్టమర్ల లైంగిక కార్యకలాపాలు సహా అత్యంత సున్నితమైన సమాచారాన్ని సైతం ఓ కంపెనీ సేకరించే ప్రయత్నం చేసినట్లుగా వారు గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. 84 శాతం కార్ బ్రాండ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు సహా ఇతర వ్యాపారులతో పంచుకునేందుకు అంగీకరించినట్లు మొజిల్లా అధ్యయనం వెల్లడించింది. వీటిలో 76 శాతం ఇప్పటికే కస్టమర్ల డేటాను అమ్మేసినట్లు వారి దగ్గర పక్కా సమాచారం ఉన్నట్లు చెప్పింది. కేవలం డ్రైవింగ్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే కాకుండా.. కారులోని ఎంటర్టైన్మెంట్ వ్యవస్థ, శాటిలైట్ రేడియో, మ్యాప్స్ నుంచి కార్ల సమాచారాన్ని సేకరిస్తున్నాయని పేర్కొంది. ఇది రానున్న రోజుల్లో ప్రమాదకరంగా మరబోతున్నట్లు తెలిపింది.