»The Bride Who Flashed The Lehenga Decorated With Led Lights Video Viral
LED లైట్లతో అలంకరించిన లెహంగాను మెరిసిన వధువు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుకలో తనకు కాబోయే భార్య చాలా బ్రైట్‌గా అందంగా కనిపించాలని కోరుకున్నాడు. ఇందుకోసం ఆమె డ్రెస్‌ను ఇప్పటి వరకూ ఎవరూ ధరించని, ఊహించని విధంగా డిజైన్ చేయించాడు.
పెళ్లి (Wedding) అనేది ఎంతో ముఖ్యమైన వేడుక. లైఫ్‌లో ఒక్కసారి వచ్చే ఈ వేడుకను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు.ఇటీవలి కాలంలో పెండ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్నాయి. వధువు, వరుడు వెరైటీ గెటప్స్‌తో పాటు, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మరోవైపు పెళ్లి వేడుక, మెహిందీ వేడుక అంటే వధువు డ్రస్సుపైనే అందరి చూపు ఉంటుంది. ప్రత్యేకంగా డిజైన్ (Design) చేయించి అందరినీ ఆకర్షించేలా వధువు డ్రస్సు తయారు చేయిస్తుంటారు.పెళ్లి రోజున ఎంతో అందంగా, బ్రైట్‌గా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం దుస్తుల దగ్గర నుంచి, అలంకరణ వరకూ అన్నీ అందరినీ ఆకట్టుకునేవిలా ఉండేలా చూసుకుంటారు. ఈ సందర్భంగా పాకిస్థాన్(Pakistan)కు చెందిన ఓ వరుడు కూడా ఇలానే ఆలోచించాడు.
వధువుకు కాబోయే భర్తే స్వయంగా డ్రస్సును డిజైన్ చేయడంతో ఆ వధువు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వరుడు డిజైన్ చేసిన డ్రస్సుతో మొహందీ వేడుకలో వధువు (Bride) తెగ సందడి చేసింది.పాక్‌లో వధువు తన భర్తతోకలిసి కలర్ ఫుల్ ఎల్ఈడీ లైట్లతో లెహంగా ధరించి వచ్చింది రెహాబ్. తన మొహందీ వేడుకకు తన భర్తతో కలిసి మెరిసే లైట్లతో అలంకరించిన దస్తులను ధరించింది. వరుడే స్వయంగా ఈ డ్రస్సును డిజైన్ చేయడం గమనార్హం. లెహంగాకు చిన్నచిన్న ఎల్ఈడీ లైట్లు అమర్చాడు. దీంతో వధువు, వరుడు స్టేజీపైకి వచ్చిన సమయంలో వధువు డ్రస్సు చుట్టూ ఎల్ ఈడీ లైట్లు వెలుగుతూ కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వధువు లెహంగాకు ఎల్ఈడీ లైట్లు అమర్చిన వధువు ఆలోచనను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. వరుడు(Groom) ఆలోచన బాగుంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. వధువు భర్త ఎలక్ట్రీషియన్ అయ్యిఉండొచ్చు అంటూ మరో నెటిజన్ (Netizen) రాశాడు. వరుడు ఐడియా బాగుంది.. వధువు ఫిదా అయింది అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. పలువురు నెటిజన్లు తమతమ అభిప్రాయాలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భర్త (husband) డిజైన్ చేసిన వీడియోపై వధువు సంతోషం వ్యక్తం చేసింది. నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే పెళ్లికూతురు కోసం ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదని నాకు తెలుసు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ వధువు పేర్కొంది.