Bigg Boss 7: హౌస్‌లో నుంచి వెళ్లిపోతానంటూ శివాజి రచ్చ!
తాజా ప్రోమోలో శివాజ్ హైలెట్‌గా నిలిచారు. ఏకంగా బిగ్ బాస్‌పై అరుస్తు కనిపించాడు. ఎవరికి భయపడనని తలుపు తీస్తే వెళ్లిపోతానని నానా రచ్చ చేశాడు. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
Big Boss: బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7)లో మూడో రోజు రచ్చ జరిగినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. షో యాజమన్యం అధికారికంగా విడులైన ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ(shivaji) రచ్చ చేస్తున్నాడు. తన చేతిలో ఉన్న వస్తువులను నేలకేసి కొట్టినట్లు కనిపించాడు. చాలా ఫ్రెస్టేషన్‌తో బిగ్ బాస్ పై కేకలు వేస్తూ హంగామా చేస్తున్నాడు. అంతేకాదు తోటి కంటెస్టెట్స్ను కూడా బెదిరిస్తున్నాడు. కాఫీ కోసం గోళ చేస్తున్న శివాజీతో బిగ్ బాస్ కాసేపు ఆడుకున్నాడు. హౌస్ లోకి బీపీ మిషన్ పంపించి శివాజీ బీపీ చెక్ చేయాలని మిగతా సభ్యులకు సూచించాడు. దీనిపై శివాజీ కొప్పడ్డాడు. అలాగే స్టెతస్ స్కోపం కూడా పంపించాడు. దీంతో మండిపడ్డ శివాజీ ఓ వైపు ఇబ్బంది పడుతుంటే జోకులేస్తావా? అంటూ బిగ్ బాస్ పై ఫయిర్ అయ్యాడు.
తన సమస్యను చూపించి మిగతా సభ్యులకు వినోదం పంచాలని అనుకుంటున్నావా? అంటూ బిగ్ బాస్ ను గట్టిగా నిలదీశాడు. తనకు హౌస్ లో ఉండడం ఇష్టంలేదని, కనీస అవసరాలు తీర్చని ఈ హౌస్ లో ఉండలేనని, తలుపు తీస్తే బయటకు వెళ్లిపోతానని డోర్ వరకు వెళ్లాడు. మరి శివాజీ హౌస్‌లో ఉన్నారా? వెళ్లిపోయారా అనేది తెలయాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. హౌస్‌లో 14 మందిలో 8 మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. దామిని(Damini), శివాజీ(shivaji), శోభా శెట్టి, గౌతమ్, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, రతిక, షకీలా ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు రానున్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ ప్రొమో చూస్తుంటే గతంలో జర్నలిస్ట్ జాఫర్, నటుడు సంపూర్ణేష్ బాబులు గుర్తుకు వస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.