Chandrababu: నీ పుట్టుకే తప్పుడు పుట్టుక.. చంద్రబాబు నాయుడు
రాయదుర్గం సభలో వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్షలు చేశారు చంద్రబాబు. ఆయన పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu:) ఆంధ్రప్రదేశ్(AP) లో సుడిగాలి పర్యటన చేస్తూ పార్టీ కార్యకర్తల్లో, ముఖ్య నేతల్లో చైతన్యాన్ని నింపుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం(Rayadurgam)లో పర్యటించారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు చేశారు. పెట్టుబడి రాయితీలు ఇస్తామని రైతులను జగన్(YS Jagan) సర్కార్ మోసం చేసిందని మండిపడ్డాడు. కొంచెం హద్దులు చెరిపేసి విమర్శలు గుప్పించారు. జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. సైకో జగన్ మోహాన్ రెడ్డి అని సంభోదించి లండన్‌లో ఉన్న ఆంధ్రాలో విధ్వంసం మాత్రం మానలేదని పేర్కొన్నారు. తన బుద్దే వంకర బుద్ది అని ప్రజలను నానా హింసలు పెట్టావు అని అన్నారు. రాయదుర్గం సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించాలని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన జగన్ పుట్టుక గురించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి వైఎస్ పార్టీ అవమానించందని, అందుకే చంద్రబాబు ఇలా ఫైర్ అయ్యారని పలువురు పేర్కొంటున్నారు.