కార్లలో ప్రయాణించే వారికి తాజా అధ్యయనం పెద్ద హెచ్చరిక చేసింది. కారులో రోజుకు ఒక గంట ప్రయాణించినా క్యాన్సెర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యయనం వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Cancer-causing chemicals in cars.. Shocking facts revealed in the study
Viral News: ఈ రోజుల్లో కారు ప్రయాణం చాలా తేలిక అయిపోయింది. మధ్యతరగతి వారు సైతం కారు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. వేగంగా గమ్యాన్ని చేరడమే కాకుండా కారు అనేది స్టేటస్‌ను కూడా తెలియజేస్తుంది. అయితే కార్లలో ఎక్కవగా తిరిగే వారికి తాజా అధ్యయనం అలెర్ట్ చేసింది. కార్లలో క్యాన్సెర్ కారకాలు వెలువడుతున్నట్లు ఓ అధ్యయనం ప్రకటించింది. కార్లోలో ప్రయాణించే వారు క్యాన్సర్ కారక కెమికల్స్ పీలుస్తున్నట్లు.. తద్వారా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టాక్సాలజీ ప్రోగ్రామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిలో భాగంగా 2015 నుంచి 2022 మధ్య కాలంలో వచ్చిన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో వెలువడిన విషయాలకు వారు షాక్ అయ్యారు. 99 శాతం కార్లలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రసాయనాలు వెలువడుతున్నాయని గుర్తించారు. వాటిలో అగ్నిప్రమాదాలను నివారించే టీసీఐపీపీ అనే కెమికల్స్, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు వెలువడుతున్నాయని తెలిపారు. కారులో సగటున రోజుకు గంట ప్రయాణించినా మానవ ఆరోగ్యానికి ప్రమాదమే అని వెల్లడించారు. ఇక వేసవిలో ఈ ప్రమాదం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. క్యాన్సర్ కలిగించే వాటిలో ప్రధానంగా కారు క్యాబిన్ గాలిలో ఉండే సీట్ ఫోమ్ అని పరిశోధకులు గుర్తించారు. అయితే కార్లలో విడుదలయ్యే క్యాన్సర్ కారక రసాయనాలను తగ్గించేందుకు గ్రీన్ సైన్స్ పాలసీ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ కొన్ని సలహాలు ఇచ్చారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కార్లను నీడలోనే పార్క్ చేయాలి.
పార్క్ చేసిన కార్లలో ఎక్కువసేపు కూర్చోవద్దు.
వేసవిలో కారు ప్రయాణం తగ్గించుకోవాలి.
కారులోపల వాడే సీటు కవర్లు, సన్ సేఫ్టీలు సహాజ సహజ పదార్థాలతో తయారు చేసినవి తీసుకోవాలి.
అప్పుడప్పుడు విండోలు తెరవాలి.