Legs Crossing : కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా? ఎన్ని నష్టాలో!
తెలిసో తెలియకో చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Side Effects of Legs Crossing : కొద్ది మందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా ఇదే భంగిమలో కూర్చుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ భంగిమలో కూర్చోవడం వల్ల అనేక అనారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుని ఈ సిట్టింగ్(SITTING) పొజిషన్ను మార్చుకునే ప్రయత్నం చేద్దాం.
కాలు మీద కాలు(LEGS CROSSING) వేసుకుని కూర్చోవడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందువల్ల రక్త ప్రసరణ వేగంలో మార్పులు వస్తాయి. కాళ్లలోకి ప్రసరణ తగ్గి తిమ్మిర్లు ఎక్కవచ్చు. అలాగే కాళ్ల వాపులు, నొప్పి, కాళ్ల తిమ్మిర్లలాంటి వాటికి దారి తీయవచ్చు. వెరికోస్ వైన్స్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది. కాళ్ల సిరల్లో రక్త ప్రవాహం తగ్గిపోవడం వల్ల అవి ఉబ్బిపోయి ఈ సమస్యకు దారి తీయవచ్చు. పురుషులు గనక ఇలా కూర్చుంటే వీర్యకణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
కాలు మీద కాలు(LEGS CROSSING) వేసుకుని కూర్చోవడం వల్ల సయాటిక్ నరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీర్ఘ కాలం పాటు ఇలా కూర్చుంటూ ఉంటే కాళ్లు మొద్దు బారడం, నొప్పి లాంటివి కలుగుతాయి. అలాగే ఇలా కూర్చోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు సైతం తలెత్తుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలా కూర్చోవడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల అజీర్ణం, పొట్ట ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు తలెత్తుతాయని షాంఘై జియాటోంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలా కోర్చోవడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుందని అనుకున్నాం కదా. అందువల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల గుండెపై ఒత్తిడి పెరిగి గుండె జబ్బుల ప్రమాదమూ పొంచి ఉంటుంది.