»People Thronged Lulu Mall In Kukat Palli And Looted It Ownership Of People Is Serious
Lulu Mall: లులు మాల్‌ను లూటీ చేసిన కస్టమర్లు.. వీడియో వైరల్
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇటీవలే ప్రారంభమైన లూలు మాల్లో కస్టమర్లు పోటేత్తారు. ఇక వీకెండ్ కావడంతో శనిఆదివారల్లో ఫ్యామిలీలతో వచ్చి సందడి చేశారు. అందులో కొత్త మంది కస్టమర్లు కాస్త రెచ్చిపోయారు.
People thronged Lulu Mall in Kukat Palli and looted it. Ownership of people is serious
Lulu Mall: హైదరాబాద్(Hyderabad) కూకట్పల్లి(Kukatpalli)లో లులు మాల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఈ బ్రాండ్‌కు ఒక ఇమేజ్ ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున తరలివెళ్లారు. అంతవరకు బాగానే ఉంది కాని ప్రజలు చేసిన పనికి లులు(Lulu) యాజమాన్యం మాములు సీరియస్ గా లేదు. కొత్తగా ప్రారంభమైన ఈ మాల్‌ను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన కస్టమర్లు లులు మాల్‌ను లూటీ చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ మాల్‌కు పోటెత్తిన జనం మాల్లో ఉన్న తినుబండరాలను ఖతం చేశారు. వివిధ ఫుడ్ ప్యాకెట్లతో పాటు కూల్ డ్రింక్ సీసాలను సైతం ఖాళీ చేసి అక్కడే వాటి స్థానంలోనే పడేసి ఏం తెలియనట్లు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నిర్వాహకులు కూడా కస్టమర్లపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. లులు మాల్ కారణంగా కూకట్పల్లి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్‌తో నగర వాసులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మన పరువు తీస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.