TS Elections: తెలంగాణ అసెంబ్లీకి ఎల్లుండి గురువారం పోలింగ్ (polling) జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు ఇచ్చారు. గురువారం ఒక్క రోజు సెలవు ఉండగా.. బుధవారం ఎన్నికల ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున బుధవారం కూడా సెలవు ఇచ్చారు.
ఉద్యోగులకు ఒకరోజు సెలవు ఉండగా.. విద్యార్థులకు మాత్రం రెండు రోజులు సెలవు ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. రేపు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలిస్తారు. గురువారం సాయంత్రం ఓటింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తీసుకెళతారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల ప్రచార గడువు ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాలు 13 నియోజకవర్గాల్లో 4 గంటలకు పూర్తయ్యింది. ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. మందు, చీర, సారె, గిప్ట్స్తో ఓటర్లకు గాలం వేసేందుకు అభ్యర్థులు రెడీగా ఉన్నారు.