Sonia Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హెరెత్తించారు. సభలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో రాష్ట్రానికి రాలేకపోయిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) వీడియో సందేశం ఇచ్చారు. నా తెలంగాణ ప్రజలారా అంటూ ఆమె సందేశం కొనసాగింది.
అనివార్య కారణాలతో మీ వద్దకు రాలేకపోతున్నాను అని సోనియా (Sonia) సందేశం స్టార్ట్ అయ్యింది. మీరు తన మనసుకు దగ్గరగా ఉంటారు. రాష్ట్రాన్ని ఇక ప్రజల తెలంగాణగా మార్చుకుందాం అని పిలుపునిచ్చారు. ఇక్కడి జనానికి మంచి ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రజల స్వప్నం సాకారం కావాలని కొనసాగించారు.
సోనియమ్మ సందేశం
తల్లికి బిడ్డపై ప్రేమ వెలకట్టలేనిది… తెలంగాణ బిడ్డల పై నా ప్రేమ అలాంటిదే.
నేను మీ దగ్గరకు రాలేకపోవచ్చు… నా మనసెప్పుడూ మీకు దగ్గరగానే ఉంటుంది.
తనపై మీరెంతో అభిమానం చూపారు. సోనియమ్మ అంటూ ప్రేమ చూపించారు. ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమకు ధన్యురాలిని.. రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఎల్లుండి గురువారం తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.