గత పదేళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయోద్దని ప్రజలకు సూచించారు.
Mandakrishna Madiga said that Bandisanjay will become CM if BJP comes to power in Telangana
Mandakrishna Madiga: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections2023)కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో పార్టీ ప్రచారాలకు తెరదించనున్నారు. ఇలాంటి ఉత్కంఠ సమయంలో బీజేపీ(BJP) ఎన్నికల ప్రచారం జోరుగానే సాగిస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బండి సంజయ్ సామాన్యుడు కాదని, ఆయనొక యుద్ధవీరుడు అని వ్యాఖ్యానించారు. సంజయ్‌కి మోడీ అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు కోరారు. ప్రతీ ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని, ఓటే సామాన్యుడి అస్త్రం అని అన్నారు.
తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మన స్వేచ్చను కేసీఆర్ వద్ద బంధీ చేశామన్నారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రజల హక్కులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని వెల్లడించారు. కేసీఆర్ హామీలు ఇవ్వడం తప్ప నేరవేర్చడంలో విఫలం అయ్యారని, పేపర్ లీకులతో ఉద్యోగులను అన్యాయం చేశారన్నారు. పొరపాటున కూడా కాాంగ్రెస్కు ఓటు వేయొద్దని, అది బీఆర్ఎస్ కంటే దారుణం అన్నారు. దేశ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి ఓటు వేయాలిని కోరారు. బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం చేస్తామని పార్టీ అదిష్టానం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి:KCRకు కొత్త భవంతులు, కొత్త కార్లు.. జనం బైబై అంటున్నారు : ప్రియాంక గాంధీ