»40 Percent Youth Tickets For Tdp In Assembly Elections
TDP : అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో (Andra pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయించింది.హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ భవన్ లో (TDP Polit Bureau meeting) నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
ఆంధ్రప్రదేశ్ లో (Andra pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయించింది.హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ భవన్ లో (TDP Polit Bureau meeting) నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తోన్న కేంద్రం, ప్రధానమంత్రికి అభినందనలు తెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రేపటి నుంచి మే 28 వరకు వివిధ ప్రదేశాల్లో వంద సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 42 పార్లమెంటు నియోజక వర్గాల్లో శతజయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించామని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ(YCP) పిచ్చి ప్రేలాపనలు ఆపాలని చెప్పారు.సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో జగన్ చెప్పాలని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 కలిపి పొలిట్ బ్యూరోలో మెత్తం 17 అంశాలపై చర్చించామని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి జగన్ కనీసం సమీక్ష జరగకపోవటం దుర్మార్గమని అన్నారు. తన తప్పును ఒప్పుకొని సీఎం జగన్ జీవో నంబర్ 1ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు. ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోని భిన్నంగా రూపొందించాలని కసరత్తు చేస్తోంది.
మహానాడు మే లో రెండు రోజుల పాటు రాజమండ్రిలో(Rajahmundry) నిర్వహించాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించింది. ఏప్రిల్ ఆఖరి వరకూ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూప కల్పన రూపొందించారు. అలాగే నవంబర్లో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పోలిట్ బ్యూరో భావించింది. ఇందుకు 5 వేల రూపాయలు రుసుముగా పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) టీడీపీ అభ్యర్ధుల విజయంపై విశ్లేషణ చేసింది. మూడు స్థానాల్లో టీడీపీ గెలవడంపై నేతలు విశ్లేషించినట్లు తెలిసింది. వైసీపీ (YCP) ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు ప్రభావితం కాలేదని పోలిట్ బ్యూరో భావిస్తోంది. అధినేత నుంచి కార్యకర్త వరకూ ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా పోలిట్ బ్యూరోలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది