పులివెందుల(Pulivendula)లో తుపాకీ మోత(gun firing) మోగింది..ఓ వ్యక్తి, తన ప్రత్యర్థులిద్దరిపై కాల్పులు(gun firing) జరిపాడు. వారు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరారు. సహజంగా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాల్పులు జరిగింది ఏపీ సీఎం సొంత నియోజకవర్గంలో కావడం, కాల్చిన వ్యక్తి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైనవాడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వస్థలం పులివెందుల(Pulivendula)లో మంగళవారం కాల్పుల(gun firing) ఘటన చోటుచేసుకుంది. పులివెందులలో భరత్‌కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కడప జిల్లా(YSR Kadapa district) వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ సమీపంలో జరిగింది. తీవ్ర గాయాలపాలైన దిలీప్‌ను కడపలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కి తరలిస్తుండగా మృతి చెందాడు. మస్తాన్ బాషా అనే మరో వ్యక్తి పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
పులివెందులలోని బీఎస్ఎన్ఎల్(BSNL) కార్యాలయం సమీపంలో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్థిక వివాదాల కారణంగా భరత్ కుమార్ యాదవ్, దిలీప్ ఇద్దరూ గత వారం రోజులుగా గొడవపడుతున్నట్లు సమాచారం. భరత్ కుమార్ కొంత డబ్బును(money) దిలీప్‌కు అప్పుగా ఇచ్చాడని, ఆ డబ్బును వీలైనంత త్వరగా తిరిగి చెల్లించాలని అతను ఒత్తిడి తెచ్చాడని తెలిసింది. అయితే ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి కారణం అని ప్రాథమికంగా తెలిసినా అసలు భరత్ కుమార్ దగ్గరకు తుపాకీ(Gun) ఎలా వచ్చిందనేదే పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భరత్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎవరీ భరత్ కుమార్..? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ సమీప బంధువే భరత్ కుమార్ యాదవ్. వివేకా హత్య కేసులో భరత్ ని కూడా సీబీఐ(SBI) ప్రశ్నించింది. అప్పట్లో సీబీఐపై కూడా భరత్ ఆరోపణలు చేశాడు. సునీత భర్త రాజశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశాల్లో సైతం చెప్పేవాడు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. భరత్ కుమార్ తో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం మరో విశేషం.
పులివెందుల బీఎస్ఎన్ఎల్(BSNL) ఆఫీస్ సమీపంలో కాల్పుల ఘటన జరిగింది. దిలీప్, మహబూబ్ భాషా ఇద్దరూ బుల్లెట్ గాయాలతో కుప్పకూలడంతో భరత్ కుమార్ అక్కడినుంచి పరారయ్యాడని అంటున్నారు. భరత్ కి తుపాకీ లైసెన్స్ ఉందా, అక్రమంగా ఆయుధాలు సమకూర్చుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు(police) విచారణ చేస్తున్నారు.