»Mla Rachamallu Siva Prasad Reddy Falls Down In Public Rally
Proddatur విన్యాసానికి పోయి బొక్కబోర్లా పడ్డ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు
విన్యాసానికి పోయి ఉన్న పళ్లు రాళ్లగొట్టుకున్నట్టు ఆయన పరిస్థితి తయారైంది. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదేదో ఘనత సాధించినట్లు.. ప్రజలకు ఏదో మేలు జరిగినట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం సంబరాలు నిర్వహించారు.
ఇప్పటికే ప్రజా వ్యతిరేకతతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేకపోతున్నారు. సీఎం జగన్ (Jagan) మాదిరి ప్రజల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు సక్రమంగా ఉండాలి కదా అంటే అది లేదు. పిచ్చి పిచ్చి విన్యాసాలు (Stunts) వేస్తే బొక్కబోర్లా పడాల్సిందే. వైసీపీ ప్రొద్దుటూరు (Proddatur) ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో బొక్కబోర్లా (Falls Down) పడ్డాడు. విన్యాసానికి పోయి ఉన్న పళ్లు రాళ్లగొట్టుకున్నట్టు ఆయన పరిస్థితి తయారైంది. అసలు ఏం జరిగిందంటే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి నిన్న తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదేదో ఘనత సాధించినట్లు.. ప్రజలకు ఏదో మేలు జరిగినట్లు కడప జిల్లా (Kadapa District) ప్రొద్దుటూరులో గురువారం సంబరాలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad Reddy) ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నుంచి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఈ క్రమంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అత్యుత్సాహానికి వెళ్లాడు. కర్ర అందుకుని కర్రసాము (Karasamu) చేసేందుకు ప్రయత్నించాడు. అర నిమిషం పాటు కర్రను అలా ఇలా తిప్పుతూ అదుపు తప్పాడు. అకస్మాత్తుగా బొక్కబోర్లా పడ్డాడు. ముందే భారీకాయం కావడంతో ఒకసారిగా పడడంతో అక్కడి కార్యకర్తలు (Karyakartas), నాయకులు భయపడ్డారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యేను పైకి లేపారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ర్యాలీలో కొనసాగారు.