Mahesh Vitta :పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ మహేష్ విట్టా!
మహేష్ విట్టా గురించి అందరికీ తెలిసిందే. ఈయన చేసే కామెడీ మమూలుగా ఉండదు. కామెడీనే కాదు బిగ్ బాస్ హౌజ్లో మహేష్ సందడి చేశాడు. తాజాగా మహేష్ విట్టా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడయ్యాడు.
మహేష్ విట్టా (Mahesh Vitta) చేసే కామెడీ సోషల్ మీడియాలో ఏదో ఓ విధంగా ట్రెండ్ అవుతునే ఉంటుంది. మీమ్స్, ట్రోలర్స్ ఈయన వీడియోలను తెగ వాడుతుంటారు. ఈయన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. గతంలో బిగ్ బాస్ 3 (Bigg Boss 3) రియాల్టీ షోలో కూడా పాల్గొన్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేష్ రాయలసీమ (Rayalaseema) యాస భలేగా ఉంటుంది. అందుకే చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్, షార్ట్స్ ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా మహేష్ ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేసి.. వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తన ప్రియురాలు శ్రావణి రెడ్డి(Shravani Reddy)ని పెళ్లి చేసుకున్నాడు. ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మహేష్ విట్టాకు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్స్. అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో ఉండగానే ఈయన తన లవ్ స్టోరీ (love story) గురించి చెప్పాడు. ఆమెను ఐదేళ్లుగా ప్రేమిస్తున్నట్లుగా.. ఆమె తన చెల్లెలు ఫ్రెండ్ అని చెప్పాడు. కానీ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పలేదు. కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్న మహేష్, శ్రావణి.. ఆ తర్వాత ప్రేమలో పడ్డాడరు. ఫైనల్గా ఆమెతో ఏడడుగులు వేసి.. తన ప్రేమను సక్సెస్ (Success) చేసుకున్నాడు. శ్రావణి రెడ్డి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.