కడప జిల్లా ప్రొద్దుటూరు (Proddatur) గవర్నమెంట్ స్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థిని తల్లి, ఉపాధ్యాయురాలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు .విద్యార్థిని తల్లి, టీచర్ కొట్టుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన కె. ప్రియ కుమార్తె లహరి (Lahari) స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. అయితే తోటి విద్యార్థినులు లహరి బ్యాగ్‌లోని నోట్ బుక్(Note book) లో ఓ లెటర్‌ను గుర్తించి ఉపాధ్యాయురాళ్లకు అందచేశారు. ఈ లెటర్‌ను హెడ్మాస్టర్ (Headmaster) కాశీప్రసాద్ రెడ్డికి ఉపాధ్యాయురాళ్లు అందజేశారు. దీంతో హెడ్మాస్టర్ లహరి తల్లి ప్రియను స్కూల్‌కు పిలిపించి విచారించారు. లహరి నోట్ పుస్తకంలోని చేతి రాతను పరిశీలించారు. ఆ లేఖ రాసింది లహరి కాదని నిర్థారించుకున్నారు. అనంతరం లహరి తల్లి ఇంటికి వెళ్లి ఇంటికి వెళ్లిపోయారు.అయితే ఉపాధ్యాయురాలు సునంద మాత్రం ఊరుకోలేదు.
విద్యార్థి లహరిని కొట్టారు. ఈ విషయాన్ని తన తల్లికి లహరి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్కూలుకు వెళ్లిన లహరి తల్లి ప్రియ.. ముగ్గురు టీచర్లతో గొడవకు దిగారు. దీంతో కోపోద్రిక్తురాలైన టీచర్ (teacher) సునంద విద్యార్థి తల్లి ప్రియపై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియ సైతం ఉపాధ్యాయురాలు సునందను కొట్టారు.ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో సావిత్రమ్మ పాఠశాలకు చేరుకొని విచారించారు. అనంతరం డీఈవో ఎద్దుల రాఘవరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాలిక తల్లి కె ప్రియతో డీఈవో మాట్లాడారు. తన కుమార్తెను వేధిస్తున్న ఉపాధ్యాయురాళ్లు సునంద, గీత, వెంకట లక్ష్మిని సస్పెండ్ చేయాలని ప్రియ డిమాండ్ చేశారు. ఈ మేరకు హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థి తల్లి ప్రియపై కూడా టీచర్ ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.