యమున నది (Yamuna River) ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వరదల నుంచి ప్రజలను రక్షించడానికి NDRF బృందాలు రంగంలోకి దిగాయి.యూపీలో చిక్కుకున్న జంతువులను, పశువుల(Cattle)ను కూడా కాపాడాయి.అయితే, వీటిలో ప్రీతమ్ జాతి(Pritam race)కి చెందిన ఓ ఎద్దు కూడా ఉంది. దీని ధర రూ.1 కోటి ఉంటుందని అంచనా.విలువైన ఎద్దును కాపాడిన ఫోటోలు, వీడియోలను ఎన్డీఆర్ఎఫ్ బృందం (NDRF) సోషల్ మీడియాలో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఘజియాబాద్‌లోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) యొక్క 8వ బెటాలియన్ పశువులను కాపాడిన ఫోటోలను పోస్ట్ చేస్తు ఈ కోటి రూపాయల విలువైన ఎద్దును రక్షించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది(Team @8NdrfGhaziabad ). ఈ ఎద్దు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎద్దు.