»World Popular Indian Sweets Among The Worlds Best Street Sweet Foods Is Mysore Pak Kulfi
World Popular Indian Sweets : ప్రపంచంలోనే ‘బెస్ట్ స్ట్రీట్ స్వీట్ ఫుడ్స్’లో మైసూర్ పాక్, కుల్ఫీకి చోటు
స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా ఇండియన్స్ స్ట్రీట్ ఫుడ్స్ ను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. తాజాగా ప్రపంచంలోనే స్ట్రీట్ ఫుడ్స్ లల్లో మైసూర్ పాక్ కు 14వ స్థానం లభించింది. అలాగే కుల్పీకి 18వ స్థానం దక్కింది.
భారత్‌లో స్ట్రీట్ ఫుడ్(Street Food)కు ప్రత్యేక ఆదరణ ఉంది. ఎన్నో స్వీట్స్ గల్లీలో ప్రత్యక్షమవుతాయి. ప్రపంచంలో పేరుగాంచిన స్ట్రీట్ ఫుడ్స్ లల్లో ఇండియన్ స్వీట్స్(Indian sweets)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇండియాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం స్వీట్ ఫేమస్(Famous). స్వీట్ తింటే కొత్త ఉత్సాహం, ఆనందం కలుగుతుంది.
క్రొయేషియాకు చెందిన ఆన్ లైన్ ట్రావెల్ అండ్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ స్వీట్స్ గురించి సరికొత్త విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్(World Popular Indian Sweets) జాబితాను విడుదల చేసింది. అందులో మన భారతీయ స్వీట్లు(Indian sweets) కూడా చోటు దక్కించుకున్నాయి.
ఆ లిస్ట్‌లో దక్షిణ భారత దేశానికి చెందిన ‘మైసూర్ పాక్’ (Mysore Pak) 14వ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత మరో ఇండియన్ స్వీట్ అయిన ‘కుల్ఫీకి (Kulfi) 18వ స్థానం లభించింది. ‘కుల్ఫీ ఫలూదా’ కూడా 32వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో పోర్చుగీస్ ఎగ్ కస్టర్డ్ టార్ట్ అయిన ‘పాస్టెల్ డి నాటా’ స్వీట్ నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఇండోనేషియాలోని జావాకు చెందిన ‘సెరాబీ’ రెండో స్థానం పొందింది.