మూడేళ్లలో 1600 లీటర్ల పాలను దానం చేసి ఎలిసబెత్ అండర్సన్(Elisabeth Anderson) అనే మహిళ గిన్నిస్ రికార్డు(Guinness Record)కెక్కారు. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం, ఓలేహా పట్టణానికి చెందిన ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్లు అయినా కూడా ఆమె నుంచి తల్లిపాలు ఓవర్ ఫ్లో(Breastmilk overflow) అయ్యేది. ఓ రుగ్మత వల్లే ఆమెలో తల్లిపాలు వస్తూనే ఉంటాయని వైద్యులు తెలిపారు. హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆమెలో నిర్విరామంగా పాల ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది.
తనకున్న రుగ్మత గురించి ఆమె ఎన్నడూ బాధపడలేదు. తన నుంచి నిరంతరాయంగా వస్తున్న పాల(Breastmilk overflow)ను వృథా కానివ్వకుండా అమెరికాలోని ఓ మిల్క్ బ్యాంకుకు దానం చేస్తూ వచ్చింది. 2015 నుంచి 2018 వరకూ మూడేళ్ల కాలంలో ఆమె మొత్తం 1,599.68 లీటర్ల తల్లిపాలను దానం చేసి పాల దేవతగా వెలసింది. 1600 లీటర్ల పాలను దానం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness Record)ల్లో స్థానాన్నిసంపాదించుకుంది.
తాను దానం చేసే పాలు(Breastmilk overflow) అమెరికాలో నెలలు నిండకముందే జన్మించే కొన్ని వేల మందికి పిల్లల ప్రాణాల కాపాడుతోందని ఎలిసబెత్ అండర్సన్(Elisabeth Anderson) తెలిపింది. ఆ పని చేస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది. ఆమె వల్ల ఎంతో మంది ప్రీ మెచ్యూర్ కిడ్స్ ప్రాణాలు నిలబడ్డాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.