Teachers Fight: విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్లు (Teachers) గీత దాటారు. స్కూల్ ఆఫీసులో గొడవకు దిగారు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో (kerala) జరిగింది.
ఎరవన్నూరులో గల ఏయూపీ స్కూల్లో కొందరు టీచర్లు (teachers) ఉన్నారు. ఇటీవల పాఠశాలలో (school) మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో.. ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదును మహిళా టీచర్ బయటి వ్యక్తి (భర్త) ద్వారా చైల్డ్ లైన్‌కు పంపించింది. ఆమె భర్త మరో స్కూల్లో (school) పనిచేస్తున్నాడు. ఆ స్కూల్లో పనిచేసే టీచర్ మీద ఫిర్యాదు కావడంతో సమావేశంలో గొడవకు దిగాడు.
ఆ సమయంలో సదరు టీచర్ (teacher) భర్త కూడా వచ్చినట్టు తెలిసింది. ఇంకేముంది మనసులో పెట్టుకున్న ఆ టీచర్ గొడవకు వచ్చాడు. ఇలా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారిని ఆపేందుకు మిగతా టీచర్లు, సిబ్బంది ప్రయత్నించారు. ఏదో అలా గొడవను సద్దుమణిగేలా చేశారు. దాడిల్లో ఏడుగురు గాయపడ్డారు.
ఆ టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ వీడియో చూసి నెటిజ్లను తెగ కామెంట్స్ చేస్తున్నారు. టీచర్లు ఏంటీ.. ఇలా గొడవకు దిగడం ఏంటీ అంటున్నారు. గొడవ పడే వీరు.. పిల్లలకు ఏం చెబుతారని అడిగారు.