మొబైల్ చేతులో ఉంటే చాలు చుట్టు పరిసరాలను మరిచిపోయి సెల్ఫీలను తీసుకుంటుంటారు కొంత మంది. ఇలా చేసి ఒక వ్యక్తి నదిలో జారిపడ్డాడు. కేదర్నాథ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Kedarnath: పిల్లల నుంచి పెద్దల వరకు మొబైల్ అనేది నిత్యవసరం అయిపోయింది. అంతే కాకుండా సెల్ఫీల(Selfie) గోల మరి ఎక్కువైంది. ఆ మధ్య సెల్పీ ఛాలెంజ్ అని కొత్త ట్రెండ్ చాలా మంది ప్రాణాలను తీసిన విషయం తెలిసిందే. చేతులో ఫోన్ ఉంటే చాలు చుట్టు పరిసరాలను పట్టించుకోరు. అవకాశం ఉంటే సింహంతో, అనకోండతో కూడా సెల్పీ తీసుకుంటారు. ఇదే తరహాలో ఒక యాత్రికుడు(traveler) ఈ సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పారే నదిని చూసి సంబరంతో సెల్ తీసి స్వియ ఫోటో తీసుకోవాలనుకొని ప్రమాదవశత్తు జారి నీటిలో పడ్డాడు. అరుపులు ఆర్తనాదాలతో మారుమోగిన ఆ ఘటన స్థాలానికి పక్కనే ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకొని యాత్రికుడి ప్రాణాలు కాపాడారు. లేదంటే సెల్ఫీ మోజులో నదిలో కొట్టుకుపోయి రిప్ అయ్యేవాడు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరాఖండ్(uttarakhand)లోని కేదార్నాథ్(kedarnath) పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా మార్గమధ్యలో మందాకి(Mandaakini)ని నదిని దాటాల్సి ఉంటుంది. నీటిని చూసి సంతోష పడిన యాత్రికుడు సాధారణంగా సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. మందాకిని నది ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా, ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో జారిపడ్డాడు. అదే ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోతూ ఒక రాయిని పట్టుకున్నాడు. బతుకుజీవుడా అంటూ భయంతో ఆ రాయిని గట్టిగా అదిమిపట్టుకున్నాడు. సమాచారం అందుకున్న సమీపంలోనే ఉన్న ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందం ఘటనాస్థలికి వచ్చి తాళ్ల సాయంతో బాధితుడిని బయటకు తీసుకొచ్చింది. ప్రాణాలు దక్కించుకున్న యాంత్రికుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్గా మారింది. దీనికి నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. పరిసరాలను గమనించకుండా ఇలా సెల్ఫీ కోసం ఎగబడితే ఇలాంటి ప్రమాదాలు తప్పవు అని కామెంట్లు చేస్తున్నారు.
#Watch: Pilgrim falls in Mandakani River while trying to take a selfie. He was rescued by the swift action of the SDRF team
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ తరుణంలో ఆగస్టు 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.