బిగ్ బాస్ షో (Bigg Boss Show) ద్వారా సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు సీపీఐ నారాయణ (CPI Narayana). కళామ్మతల్లికి అన్యాయం చేస్తున్నారు. దీని ద్వారా కళామ్మతల్లికి ప్రమాదం ఏర్పడిందని బిగ్ బాస్‌ని నిలిపివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి కూడా నారాయణ ఒక వీడియో విడుదల (Video release) చేస్తుంటారు. ఈ సీజన్‌కి కూడా తన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ బిగ్ బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి తన మాటల్లో మరి కాస్త ఘాటు పెంచుతూ.. అది చాలా అనైతిక షో అని, బూతుల ప్రపంచం అని ఆయన విరుచుకుపడ్డారు.
ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇలాంటి బిగ్ బాస్ ప్రసారానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం (State Govt) కానీ ఎందుకు అనుమతిస్తోంది. ఇదో బూతుల ప్రపంచం. ఈ బూతుల ప్రపంచాన్ని వందల, వేల కోట్ల వ్యాపారాలకు ఉపయోగపడే పద్ధతుల్లో బిగ్ బాస్‌కి అనుమతి ఇవ్వడం చాలా ఘోరం. హౌస్‌లో వాళ్ళ కీచులాటలు, పోట్లాటలు.. ఓ అనైతిక పద్ధతైన వ్యవహారం ఇది.ప్రముఖ రియాలిటీ షో (Reality show) బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో యువతను తప్పుదారి పట్టించేలా ఉందని.. ఈ కార్యక్రమంలోని సన్నివేశాలు నైతిక విలువలను నాశనం చేసేవిగా ఉన్నాయని ఆరోపించారు.
అందువల్ల ఈ షో అంశాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా స్వీకరించి కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. బిగ్ బాస్ సంస్కృతి బీజేపీ సంస్కృతి ఒక్కటేనా అని ప్రశ్నించారు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బిగ్ బాస్‌పై పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం లేదని.. కోర్టులను ఆశ్రయించినా బిగ్ బాస్ షో జోలికి పోవడం లేదన్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు శక్తివంతులు కావడం వల్లే దీని జోలికి ఎవరూ వెళ్లడం లేదని ఆరోపించారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమాజాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాగా బిగ్ బాస్ షోను బ్యాన్ (Ban) చేయాలని నారాయణ గతంలోనూ అనేక సార్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.