బిగ్ బాస్ సీజన్ (Bigg Boss season) ఎట్టకేలకు లేటెస్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్‌తో హౌస్ నిండిపోయింది. అంతకుముందు సీజన్స్లా కాకుండా ఉల్టా ఫుల్టా అని నాగార్జున (Nagarjuna) చెప్పడంతో ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఇక కంటెస్టెంట్స్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్గా నటించిన రతికా (Ratika) బ్రేకప్ స్టోరీ వైరల్‌గా మారింది.ప్రస్తుతం బిగ్ బాస్ లోపల ఉన్నవారు కేవలం గెస్టులుగా వెళ్ళినవారేనని అంటున్నారు. వాళ్లు కంటెస్టెంట్స్‌గా మారాలి అంటే బిగ్ బాస్ పెట్టే టాస్క్స్ కొన్ని ఫేజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫస్ట్ డే ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం.. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం చూపించారు. అలాగే పులిహోరలు.. ఎఫైర్లు మొదటిరోజునుంచే మొదలయ్యాయి.
హీరోయిన్ రతికా రోజ్‌తో యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashant) కు ఎఫైర్ మొదలయ్యింది. వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు మ్యూజిక్ వేశారు. దీంతో స్టార్టింగ్‌లోనే రతికా పేరు మార్మోగిపోతోంది. అమ్మడు హీరోయిన్ అవడంతో అందరి దృష్టి ఆమె పైనే పడింది. దాంతో ఆమె గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ 2020లో షకలక శంకర్ (Shakalaka Shankar) నటించిన ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ చిత్రంలో హీరోయిన్గా నటించింది. అలాగే ఇటీవల బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో ఒక పోలీసు అధికారిగా నటించింది. అయిన కూడా అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
కానీ లేటెస్ట్ న్యూస్ మాత్రం అమ్మడిని నిజంగానే బిగ్ బాస్ చేసేలా ఉంది. అసలు ఆమె పేరు రతికా రోజ్ కాదట. ప్రియా (Priya) అనే పేరుతో గతంలో ఈటీవీలో ప్రసారమైన పటాస్ షోలో అనేక ఎపిసోడ్లలో రతికా కనిపించిందని అంటున్నారు. అంతేకాదు.. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఉన్న ఒక వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో కూడా పడిందట. కానీ కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారట. అందుకే డే వన్ నాగార్జున ఆమెకు బ్రేక్ అయిన హార్ట్ ఇచ్చి లోపలికి పంపించాడని అంటున్నారు. ఏదేమైనా రతికా మాత్రం బిగ్ బాస్ హాట్ కంటెంట్‌గా మారిందని చెప్పొచ్చు.