తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) రాజకీయ జీవితం పై మరోసారి ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఆయనకు గవర్నర్ పదవిని బీజేపీ (BJP) ఆఫర్ చేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవల వరుసగా ఆయన రాజకీయా నేతల్ని కలుస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యూపీ సీఎం యోగి (CM Yogi) ఆదిత్యనాథ్‌ను ఆ తర్వాత జార్ఖండ్ గవర్నర్ సీపీ రాథాకృష్ణ తర్వాత తమిళనాడు గవర్నర్(Governor)లతో భేటి అయ్యారు. ఈ వరుస సమావేశాలకు కారణం ఆయన పరోక్ష రాజకీయ రంగ ప్రవేశమేనన్నది ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో నలుగుతున్న హాట్ టాపిక్. నిజానికి భారతీయ జనతా పార్టీతో మొదట్నుంచి రజనీకాంత్‌కు మంచి మిత్రత్వం ఉంది. గతంలో చాలా సార్లు రజనీ తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేశారు.
గతంలో చెన్నై వచ్చినప్పుడు ప్రధాని మోదీ (PMMODI) స్వయంగా రజినీకాంత్ ఇంటికి వెళ్లారు. కొన్ని గంటల పాటు అక్కడ గడిపారు. కానీ అవేవీ ఫలించలేదు. ఆయనే స్వయంగా పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాలను ఒక ఊపు ఊపేద్దామనుకున్నప్పటికీ.. సవాలక్ష కారణాల వల్ల అది సూపర్ స్టార్ వల్ల కాలేకపోయింది.తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ అగ్రనాయకత్వం మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు గవర్నర్ గిరి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్‌కు ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆయన చరిష్మా పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యంగా తమిళనాడులో సీఎం స్టాలిన్(CM Stalin)ను కట్టడి చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై పట్టు ఉన్న రజినీకాంత్‌ను తెలంగాణ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.