చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. సినిమా నచ్చితే వాళ్లను ఇంటికి పిలిపించుకొని మరీ అభినందిస్తారు. తాజాగా రిలీజ్‌కు రెడీ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు చిరు.
అనుష్క శెట్టి(Anushka Shetty), నవీన్ పోలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మెగాస్టార్ కోసం మూడు రోజుల ముందే స్పెషల్ షో (Special show) వేశారు. ఆయనకు ఈ సినిమా తెగ నచ్చేసిందట. దీంతో చిత్ర యూనిట్‌ని ఇంటికి పిలిపించుకుని అభినందించారు. ఈ విషయాన్ని చిరంజీవినే స్వయంగా ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్.
నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా వున్న మనందరి ‘దేవసేన’ అనూష్క శెట్టిలు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ Mahesh Babuని అభినందించాల్సిందే.
ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి (Mr. Polisetti) 100% ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు.. చిత్ర యూనిట్‌కి అందరికీ నా అభినందనలు ,శుభాకాంక్షలు.. అని రాసుకొచ్చారు. ఈ ఒక్క మెగా ట్వీట్ సినిమాకు మరింత ప్లస్ కానుందనే చెప్పాలి. ఎలాగూ.. మెగాస్టార్ రివ్యూ (Megastar Review) అదిరిపోయింది కాబట్టి.. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి హిట్ ఖాయమనే చెప్పాలి.